Praja Kshetram
క్రైమ్ న్యూస్

తాళం వేసి ఊరికి వెళ్ళిన ఇంట్లో దొంగతనం చేసిన గుర్తు తెలియని దుండగులు

తాళం వేసి ఊరికి వెళ్ళిన ఇంట్లో దొంగతనం చేసిన గుర్తు తెలియని దుండగులు

 

 

 

కొండాపూర్ జూన్ 05 (ప్రజాక్షేత్రం): మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో దొంగలు చొరబడి దొంగతనం చేశారు.కొండాపూర్ ఎస్సై హరి శంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారంగా గొల్లపల్లి గ్రామానికి చెందిన చాకలి చంద్రయ్య ఇంట్లో దొంగతనం జరిగిందన్నారు.ఇంట్లో వారంతా ఇంటికి తాళం వేసి మంగళవారం రోజు ఉదయం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు.ఇదే అదునుగా చూసిన గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో గోడ దూకి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో దాచిన సుమారు మూడు తులాల బంగారం, వెండి, కొంత నగదును అపహరించినట్లు గుర్తించారు.వెంటనే స్పందించిన కొండాపూర్ ఎస్సై హరి శంకర్ గౌడ్ తన సిబ్బందితో శూన్యంగా పరిశీలించారు.వెంటనే క్లూస్ టీం , పోలీస్ డాగ్ స్కాట్ , నీ పిలిపించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.గ్రామంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే దుండగులను పట్టుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.ఎవరైనా విహారయాత్రలకు, దైవదర్శనాలకు వెళ్తున్నారో పోలీస్ స్టేషన్ కి వచ్చి వారి వివరాలు తెలియజేయాలన్నారు.రాత్రి వేళల్లో గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు ఎస్సై హరి శంకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఈ దర్యాప్తులో ఎస్సై హరి శంకర్ గౌడ్ తో పాటు క్లూస్ టీం సిబ్బంది చిట్టిబాబు, డాగ్ స్క్వాడ్ మొగులయ్య, హనుమంతు హెడ్ కానిస్టేబుల్ పండరి,మల్లేశం,కానిస్టేబుల్ శివశంకర్ మరియు సిబ్బంది తో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts