Praja Kshetram
తెలంగాణ

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

 

*ఎంపీడీవో జ్యోతిలక్ష్మి.*

 

 

 

కొండాపూర్ జూన్ 05 (ప్రజాక్షేత్రం):

కొండాపూర్ మండలం తొగరుపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి మండల ఎంపీడీవో జ్యోతిలక్ష్మి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి తన బాధ్యతగా ఒక మొక్కను నాటి,కేక్ కట్ చేసి వారితో పర్యావరణ మరియు వాటి పరిరక్షణ గురించి వారితో చర్చించారు.ఎంపీటీవో జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలనిఆమె కోరారు.మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.రాబోయే సమాజాన్ని కాపాడటంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.పిల్లలకు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలన్నారు.

పర్యావరణాన్ని రక్షిస్తేనే ఆ పర్యావరణం మనల్ని రక్షిస్తుందన్నారు.

పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా చెట్లు కొట్టవద్దని కోరారు.

మొక్కలు నాటకపోవడంతో ప్లాస్టిక్ వాడకం పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

పర్యావరణానికి ప్లాస్టిక్ పెద్ద ముప్పుగా మారింది.

ఇక్కడ చూసిన వాడి పడేసిన ప్లాస్టిక్ సంచిలో కనిపిస్తున్నాయి ఇంట్లో మిగిలిన పాడైపోయిన ఆహారాన్ని కవర్లలో వేసి పడేస్తున్నాడంతో వాటిని తిని పశువులు చనిపోతున్నాయని తెలిపారు.

వాటికి బదులుగా చేనేత సంచులు వాడితే పర్యావరణానికి,ఆరోగ్యానికిఎంతో మంచితని ఆమె విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే కాలుష్యం పెరిగి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుందన్నారు.

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం మన ఆరోగ్యానికి మంచిదని ఈ విధంగా ఆమె తెలియజేశారు.

ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక్క మొక్క నాటిన అది పెరిగి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వీరప్ప,టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్,ఈసీ గణేష్, పంచాయతీ కార్యదర్శి నర్సమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మారావు, గ్రామ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Related posts