రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : వ్యవసాయ అధికారి సురేష్ బాబు
శంకర్ పల్లి జూన్ 06 (ప్రజాక్షేత్రం):రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని శంకర్ పల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాలలో విత్తనాల నిల్వలను, స్టాక్ బోర్డులను పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ డీలర్లు ఎవరైనా విత్తనాల కృత్తిమ కొరతను సృష్టించిన, అధిక ధరలకు అమ్మిన చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.