భారత జాతీయ మహిళా సమాఖ్య 70 సంవత్సరాలు పూర్తి సందర్భంగా చేవెళ్లలో మహిళా సమాఖ్య వార్షికోత్సవాలు
*మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలి*
*రాష్ట్ర అధ్యక్షురాలు ఉజ్వల సృజన*
చేవెళ్ల జూన్ 06 (ప్రజాక్షేత్రం): గురువారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల కేంద్రంలోని భూ పోరాట కేంద్రం సిపిఐ కాలనీ పేస్ 2 లో ఈరోజు భారత జాతీయ మహిళా సమాఖ్య జండా ఆవిష్కరణ కార్యక్రమం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్ల మంజుల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు ఉజ్వల సృజన గారు హాజరై మహిళా సమాఖ్య జెండాను ఆవిష్కరించడం జరిగింది సమాజంలో సగభాగంగా ఉన్నారు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల అవుతున్న మహిళలకి పూర్తి హక్కులు గూడు గుడ్డ స్వేచ్ఛ రక్షణ ఇంకా ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి వీటి కోసం భవిష్యత్తులో మహిళలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం కావాలని ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పథకాలకు అమలుకై పోరాటం చేసి సాధించుకోవాలన్నారు ఎన్ని చట్టాలు వచ్చినా అన్ని ప్రభుత్వాలు మారినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు ఇదే సందర్భంగా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కోచబోని నీలమ్మ గారు మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎండి ఫై మీద లు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో మహిళా సమైక్య బలోపేతానికి కృషి చేయాలన్నారు మహిళలు ఎక్కడ అన్యాయానికి గురి అయిన మన సంఘం ముందుంటుందని అనేక పోరాటాలలో నాటి నుండి నేటి వరకు 70 సంవత్సరాల పూర్తి సందర్భంగా అనేక విజయాలు సాధించారన్నారు భవిష్యత్తులో ఇంకా అనేకమైన సమస్యలపై మహిళలు పోరాటాలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి గారు మాట్లాడుతూ మహిళలు లేనిదే ఏ పోరాటం లేదు ఏ పోరాటం తీసుకున్న మహిళలే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ప్రస్తుతం నిర్వహించిన పోరాటంలో కూడా మహిళలు ముందంజలో ఉండి పోరాటాన్ని నిర్వహిస్తున్న మహిళలకు ఇక్కడ అన్యాయం జరిగిన సహించేది లేదని వారికి ధైర్యాన్ని చేకూర్చారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సప్తమిటి సభ్యురాలు కమల చేవెళ్ల ప్రజానాట్యమండలి కామ్రేడ్ మరియు యాదగిరి విజయ రమాదేవి వెంకటమ్మ సువర్ణ అంజమ్మ రేణుక జయమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.