Praja Kshetram
సినిమా న్యూస్

చిరంజీవి ఇంట్లో పవన్ కల్యాణ్ సంబరాలు

చిరంజీవి ఇంట్లో పవన్ కల్యాణ్ సంబరాలు

 

*-టపాసులు..స్వీట్లతో అభిమానుల సందడి*

*-అమ్మ…అన్నా వదినలకు పవన్ పాదాభివందనం*

హైదరాబాద్ జూన్ 06 (ప్రజాక్షేత్రం): ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న జనసేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ గురువారం హైదరాబాద్‌లోని తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం, అభినందనలు అందుకున్నారు. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా మెగా అభిమానులు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణి చేసి, పూల వర్షం కురిపించి సందడి చేశారు. చిరంజీవి ఇంటికి చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడ ఉన్న తన తల్లితో పాటు అన్న చిరంజీవి దంపతులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి నాగబాబు ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు. తర్వాత చిరంజీవి గులాబీ గజమాలతో పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. కుటుంబ సభ్యులందరూ పవన్ కల్యాణ్‌తో భారీ కేక్ కటింగ్ చేయించారు. తమ్ముడు పవన్ సాధించిన విజయం పట్ల చిరంజీవి ఆనందంతో ఉప్పొంగారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులు రామ్ చరణ్, రామ్ చరణ్, భార్య ఉపాసన, చిరంజీవి కుమార్తెలు, మనవరాళ్ళు, మనవళ్లు, వరుణ్ తేజ్ ఆయన భార్య లావణ్య, నిహారిక సహా అందరూ పాల్గొన్నారు. పవన్ వెంట తన భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అఖీరా నందన్ కూడా ఉన్నారు. పవన్ దంపతులకు చిరు సతీమణి సురేఖ మంగళహారతితో స్వాగతం పలికారు.

Related posts