Praja Kshetram
తెలంగాణ

జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

 

 

 

హైదరాబాద్ జూన్ 06 (ప్రజాక్షేత్రం): ప్రస్తుత జాతీయ రాజకీయ పరిణామాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ప్రవీణ్‌ కుమార్‌ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది మంది కాంగ్రెస్‌కు, ఎనిమిది మంది బీజేపీకి 8, ఒకటి ఎంఐఎం గెలిచారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు కేవలం గుంపులో గోవింద లెక్క అయ్యారని అన్నారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబుకు 16, బిహార్‌లో నితీశ్‌కుమార్‌ కేవలం 12 సీట్లు గెలిచి ఇవాళ చక్రం తిప్పుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించి తెలంగాణ వారికి వాయిస్‌ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు 10 ఎంపీ సీట్లు ఉంటే, మనం కూడా చక్రం తిప్పుతుండే వారమని చెప్పారు. మన రాష్ట్రానికి మనకు కావాల్సినవి తెచ్చుకునే వారమన్నారు. ముందు నుంచీ, మన బుర్రలేని తనం వల్లనే తెలంగాణ ఎప్పుడు మోసపోతుందని, కేసీఆర్‌ నాకు 10 ఎంపీలు ఇవ్వండని క్లియర్‌గా అడిగితే వెటకారం చేశారని ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

Related posts