Praja Kshetram
తెలంగాణ

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి : టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నివాస్ 

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి : టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నివాస్

 

శంషాబాద్ జూన్ 07 (ప్రజాక్షేత్రం) : శుక్రవారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్,ఆశా వర్కర్లతో కలిసి మొక్కను నాటిన టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ గారు మొక్కలు నాటారు.
సందర్భంగా లక్ష్మీ నివాస్ మాట్లాడుతూ….. సమాజంలో సమూల మార్పులు తీసుకువచ్చే శక్తి విద్యార్థులో ఉంటుందని అన్నారు. ప్రజలు, యువత సామాజిక స్పృహను అలవార్పుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. చెట్లు లేకుంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, కాలుష్యం మానవ జీవన ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. కాలుష్యాన్ని తరిమికొట్టాలంటే ప్రతి ఇంటి ఆవరణలో, వ్యవసాయ పొలాలలో మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, ఆశా వర్కర్లు, టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర నాయకులు సుదర్శన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts