Praja Kshetram
తెలంగాణ

చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ముందే చెప్పిన మరకత శివాలయం ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ స్వామి

చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ముందే చెప్పిన మరకత శివాలయం ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ స్వామి

 

శంకర్‌ పల్లి జూన్ 07 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల ఎంపీగా బిజెపికి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి 1,73,000 ల మెజార్టీ సాధించారు. సరిగ్గా రెండు నెలల క్రితం బిజెపి అధిష్టానం కొండా విశ్వేశ్వర్ రెడ్డిని చేవెళ్ల బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది. ప్రకటించిన రెండు, మూడు రోజులకే శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని కొండ విశ్వేశ్వర్ రెడ్డి సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న ఆలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ స్వామి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించి, లింగాన్ని ఇచ్చి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. దయాకర్ స్వామి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ సరిగ్గా రెండు నెలల క్రితమే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించినప్పుడు భారీ మెజార్టీతో చేవెళ్ల గడ్డపై గెలుస్తారని అందరి సమక్షంలో చెప్పారని పేర్కొన్నారు. దయాకర్ స్వామి ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు దయాకర్ స్వామి చెప్పినట్టుగా వంద శాతం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

Related posts