Praja Kshetram
తెలంగాణ

రేవంత్ పాల‌న ఎలా చేయాలో నేర్చుకోవాలి : మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

రేవంత్ పాల‌న ఎలా చేయాలో నేర్చుకోవాలి : మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

 

హైద‌రాబాద్ జూన్ 07 (ప్రజాక్షేత్రం): తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. ఉంటాను అని సీనియ‌ర్ నాయ‌కులు మోత్కుప‌ల్లి నర్సింహులు స్ప‌ష్టం చేశారు. ద‌ళితుడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రేవంత్ ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని చెప్పింది తానే. కానీ మొద‌ట‌గా సీఎం మ‌మ్మ‌ల్నే రోడ్డున ప‌డేశారు. మాదిగ‌ల‌కు ఒక్కంటే ఒక్క ఎంపీ సీటు ఇవ్వ‌లేదు. ఆరు గంట‌ల పాటు స‌చివాల‌యంలో కూర్చున్న సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. ఇన్నేండ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఇంత అవ‌మానం ఎక్క‌డ జ‌ర‌గ‌లేదు. జ‌గ‌న్ అహంకారం వ‌ల్ల ఈ రోజు ఈ ప‌రిస్థితి తెచ్చుకున్నాడు. ఎన్నిక‌ల హామీల‌ను ఎందుకు ఇంకా నెర‌వేర్చ‌లేదు. పేద ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంది. చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాడు. రేవంత్ పాల‌న ఎలా చేయాలో నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మోత్కుపల్లి న‌ర్సింహులు పేర్కొన్నారు.

Related posts