Praja Kshetram
తెలంగాణ

కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణం కాపాడాలి

కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణం కాపాడాలి

 

• రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చింపుల సత్యనారాయణ*

 

చేవెళ్ల జూన్ 07 (ప్రజాక్షేత్రం):జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చింపుల సత్య నారాయణ రెడ్డి చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామం లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ప్రభుత్వం అధికారకంగా కార్యక్రమం చెప్పట్టలేదన్నారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు (యు ఎన్ ఇ పి) నిర్వహిస్తూ జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1972లో ప్రారంభించిందని వివరించారు. ప్రతి సంవత్సరం జూన్ 5న ఈ సమ్మేళనం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యం పెరిగిపోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్కాపూర్ మాజీ ఉపసర్పంచ్ యాదిరెడ్డి మాట్లాడుతూ మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరి, ప్రాణవాయువు తగ్గిపోతోందని పేర్కొన్నారు. 2016లో వెలువడ్డ ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 90% ప్రజలు కలుషితమైన వాయువులు పీలుస్తున్నారని వెల్లడించారు. దీని కారణంగా అనేక రకాలైన శ్వాస రోగాలు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణికోటి, వృక్షజాతులు ప్రమాదంలో పడ్డాయన్నారు. దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ప్రాజెక్టులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో పీ ఏ సీ ఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి,డైరక్టర్ శివ రాజ్, ఎంపీటీసీ సభ్యులు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు యాదిరెడ్డి, నరేందర్ గౌడ్, మాజీ వార్డ్ సభ్యులు అశోక్, పురాన్ దాస్, ఇంద్ర సేనా రెడ్డి, ప్రభా్కర్ రెడ్డి, నర్సిoలు, రమేష్ గౌడ్, చామంతి రమేష్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts