డీజిల్ ట్యాంకర్ బోల్తా.. బకెట్లతో ఎగబడిన జనం
యాదాద్రి భువనగిరి జూన్ 07 (ప్రజాక్షేత్రం) : డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో డీజిల్‌ను తీసుకు వెళ్లడానికి జనాలు డబ్బాలు, బకెట్లతో ఎగబడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పర్వతాపూర్‌లో ప్రమాదవాశాత్తు డీజిల్ ట్యాంకర్ (లారీ) బోల్తా పడింది. దీనిని గమనించిన స్థానికులు డబ్బాలు, బకెట్లతో తరలి వచ్చిన డీజిల్ తీసుకువెళ్లడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందినకాడికి డీజిల్ దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.