Praja Kshetram
క్రైమ్ న్యూస్

పార్టీ మార్పు,వాట్సప్ గ్రూపులో ఫోటోలు తొలగించారని కక్ష్య.!

పార్టీ మార్పు,వాట్సప్ గ్రూపులో ఫోటోలు తొలగించారని కక్ష్య.!

 

*-ఇద్దరు యువకుల హత్య కేసులో ఏడుగురు అరెస్ట్.*

 

*-వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి.*

 

 

శంషాబాద్ ప్రతినిధి జూన్ 07 (ప్రజాక్షేత్రం):వాట్సాప్ గ్రూప్ లో అధిక సంఖ్యలో ఫోటోలు పంపడం,గ్రూప్ నుండి తొలగించి,పార్టీ మార్పు కారణంగా ఇద్దరూ వ్యక్తులు హత్యకు గురయ్యారని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అన్నారు.శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన జల్కం రవి, గుండమోని శివ, శేషగిరి శివలు గతంలో బీజేవైఎం ఆర్గనైజేషన్ లో పని చేసేవారని ,ఈ మధ్యకాలంలో మృతులు ఇద్దరూ రవితో మనస్పర్థల కారణంగా బీజేవైఎం ఆర్గనైజేషన్ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా చేరారు అని పేర్కొన్నారు.

 

*పార్టీ మారినప్పటి నుండి కక్ష్య..!*

 

అప్పటినుండి వారి మధ్య వ్యక్తిగత ద్వేషాలు పెరిగాయని,ఈనెల 4న జల్కం రవి పుట్టినరోజు సందర్భంగా గోవిందయ పల్లిలో అద్దెకు నివాసం ఉంటున్న బటర్ఫ్లై సిటీ వెంచర్ లోని ఓ విల్లాలో వేడుకలు నిర్వహించారు.పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను గోవిందాయ పల్లి గ్రామానికి చెందిన వాట్సప్ గ్రూపులో సుమారు 200 నుంచి 300 వరకు ఫోటోలు పోస్ట్ చేశారని వాటిని వారు అధిక సంఖ్యలో పోస్ట్ చేయడం ద్వారా ఆ ఫోటోలను, అతనిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని పేర్కొన్నారు. దీంతో జల్కం రవి ఆగ్రహానికి గురి కావడంతో , తనను గ్రామంలో అవమానపరిచిన వ్యక్తులను తుది ముట్టించాలని ప్రణాళిక రచించారు.ఈ నేపథ్యంలో తన స్నేహితులు అయిన పల్లె నాగరాజుగౌడ్,తలకొండ రాజు,గిలుకుంట్ల విజయ్,నిట్ట ప్రవీణ్, వల్లెపు దాసు శేఖర్, తిరుపతి జగదీష్ గౌడ్ లతో కలిసి పన్నాగం పన్నారు.హైదరాబాద్ గాయత్రి నగర్ లో ఉంటున్న గుండమోని శివ, శేషగిరి శివలను కిడ్నాప్ చేసి జల్కం రవి కారులో కడ్తాల్ బట్టర్ ప్లై సిటీ వెంచర్ వెంచర్ తీసుకువచ్చారు. అనంతరం వారి మధ్య మాట మాట పెరిగి విచక్షణారహితంగా కత్తితో పొడిచి ఆ విల్లాకు తాళం వేసి పారిపోయినట్లు తెలిపారు. ఈ కేసులో జంట హత్యలకు కారణం అయిన ఏడుగురుని అరెస్టు చేసి, వారి వినియోగించిన కత్తి, సెల్ఫోన్లను, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

 

*అభినంధించిన శంషాబాద్ డిప్యూటీ కమిషనర్,శంషాబాద్ అడిషనల్ డీసీపీ.*

 

జంట హత్యల కేసును త్వరితగతిన పూర్తిచేసిన పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.జంట హత్యల కేసులో శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ నారాయణరెడ్డి, శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్,శంషాబాద్ ఎసిపి రంగస్వామి,కడ్తాల్,షాద్ నగర్,శంషాబాద్ సీఐలు శివప్రసాద్,సత్యనారాయణ,పవన్ కుమార్,కడ్తాల్, తలకొండపల్లి ఎస్సైలు శివశంకర వరప్రసాద్,శ్రీకాంత్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించి,అధికారులకు రివార్డు అందజేశారు.

Related posts