Praja Kshetram
తెలంగాణ

lకేజీబీవీ, యు ఆర్ ఎస్ నాన్ టీచింగ్ వర్కర్స్ కనీస వేతనాలను రూ” 27 వేలకు పెంచాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా.

కేజీబీవీ, యు ఆర్ ఎస్ నాన్ టీచింగ్ వర్కర్స్ కనీస వేతనాలను రూ” 27 వేలకు పెంచాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా.

 

– *-ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. జనార్దన్,*

– *-తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంటా నాగయ్య, వై. గీతా*

 

చేవెళ్ల జూన్ 07 (ప్రజాక్షేత్రం): గత పది సంవత్సరాలుగా బీ ఆర్ ఎస్ పాలనలో కేజీబీవీ నాన్ టీచింగ్ మహిళా కార్మికులు అనేక అవస్ధలు పడ్డారని,వాళ్ళని విస్మరించారని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ” 27 వేలుగా నిర్ణయించి, పర్మినెంట్ చేయాలని

కే జీ బీ వీ, యు ఆర్ ఎస్ నాన్ టీచింగ్ వర్కర్స్ డైరెక్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా లో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ పాల్గొని డిమాండ్ చేశారు.గత కేసీఆర్ బీ ఆర్ ఎస్ పాలనలో కార్మికులు ముఖ్యంగా కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు అందులో కే జీ బీ వీ నాన్ టీచింగ్ మహిళా వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావని,లేచిన కానుండి నిద్రపోయేవరకు కేజీబీవీ లలో గొడ్డు చాకిరీ చేస్తూ, పనిభారంతో నలిగిపోతున్నారని, కే జీ బీ వీ, యు ఆర్ ఎస్ వర్కర్ ల పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించడంతో అనేక ఆర్ధిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు కే జీ బీ వీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్(ఐ ఎఫ్ టి యు)రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.

అనంతరం ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లయ్య బట్టు కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. జనార్దన్, తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంటా నాగయ్య, వై. గీతా లు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు పూర్తయిందన్నారు, ఈ కాలంలో రాష్ట్రంలో ఉన్న అనేక రంగాల కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న ఏ సమస్యను పరిష్కరించడానికి పూనుకోలేదని,ఎన్నికల ముందు కార్మికులకు అనేక హామీలను ఇచ్చిందని, వాటి పరిష్కారం కోసం ఏమాత్రం కృషి చేయలేదని అన్నారు.రాష్ట్రంలో 75 షెడ్యూల్డు ఎంప్లాయిమెంట్ జీ ఓ లు గత దశాబ్దానికి పైగా పెండింగ్ లో ఉన్నప్పటికి వాటిని గెజిట్ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కార్మికుల ప్రస్తుత వేతనాల కంటే చాలా తక్కువగా నిర్ణయించారని, తక్షణమే వాటిని సవరించాలని అన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని, కే జీ బీ వీ లలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ కు వేతనాలు రూ ” 27 వేలకు పెంచాలని,పర్మినెంట్ చేయాలని,పనిభారం, వేధింపులను ఆపాలని కోరారు. డ్యూటీలు చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అనేకమంది కార్మికులు ప్రమాదానికి గురై చనిపోయారని వారి కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో ఒక్కరోజు కూడా నాన్ టీచింగ్ వర్కర్స్ కు సెలవులు ఇవ్వకపోవడంతో మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరికి వీక్లీ ఆఫ్ లు నిర్దిష్టంగా అమలు చేయాలని అన్నారు. పార్ట్ టైం ఉద్యోగులైన క్రాఫ్ట్, కంప్యూటర్లకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయని వీరితో ఫుల్ టైం పని చేయించుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. అకౌంటెంట్లకు టి ఎ, డి ఎ లు ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ లుగా గుర్తించాలని, ప్రతి పాఠశాలకు కేర్ టేకర్ ను ,ఒక వెహికల్ ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాలలను ఆఫ్ గ్రేడ్ చేసిన తర్వాత వర్కర్స్ ను నియమించకపోవడంతో అధిక పని భారం పడి వర్కర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. స్విపర్ ,స్కావెంజర్ లకు బ్లౌజులు, మాస్కులు తదితర రక్షణ పరికరాలు ఇవ్వాలని, ఏఎన్ఎం లకు మూడు రోజుల నైట్ డ్యూటీలు రద్దు చేయాలని అన్నారు.పి ఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించి,ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఫీయా,లక్ష్మి, అనిత ,స్వర్ణ,సరళ,అరుణ,అంజమ్మ,అలివేలు, జాని బేగం,పద్మ,నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Related posts