పి ఎస్ ఎచ్ ఎం పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలి : ఇలిటం గాలయ్య
శంకర్ పల్లి జూన్ 09 (ప్రజాక్షేత్రం): ఆదివారం శంకర్ పల్లి మీడియా సమావేశంలో ఇలిటం గాలయ్య తెలంగాణ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెలలో ఉపాద్యాయుల బదిలీలు , పదోన్నతులు జరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా అన్ని ప్రాథమిక పాఠశాలలో పి ఎస్ ఎచ్ ఎం పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలనీ డిమాండ్ చేసారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది ప్రాథమిక పాఠశాలలోనే ఉంటుంది ఇక్కడ సరియైన భోధన అందకపోతే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది పునాది పటిష్టంగా ఉండాలంటే తరగతికి తగ్గ ఉపాధ్యాయులను నియమించాలని అన్నారు. అంతే గాకుండా ప్రస్తుతం విద్యావ్యవస్థలో చాలమార్పులు రావడం జరిగింది. అందులో భాగంగానే ఆన్లైన్ రిపోర్టులు, ఎఫ్ ఎల్ ఎన్ విధానంలో విద్యాభోధన, విద్యార్థుల ఆన్లైన్ ముఖ హాజరు మొదలైన పనులతో ఉపాధ్యాయులకు ఎక్కువ పని భారం పడుతుందని దీనితో బోధనకు చాలా ఆటంకం కలుగుతుందని అందుకే అదనంగా ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్య తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులని నియమించాలని కోరారు. గతంలో ప్రకటించినట్లుగా 10,000 పి ఎస్ ఎచ్ ఎం పోస్టులను వెంటనే మంజూరు చేసి వాటిని ఎస్ జి టి ఉపాధ్యాయులతో ప్రమోషన్ ఇస్తూ భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.