పాపం కంటతడి పెట్టిన గ్రూప్ వన్ అభ్యర్థి
ఇబ్రహింపట్నం జూన్ 09 (ప్రజాక్షేత్రం): ఇబ్రహీంపట్నం సైంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు నిమీషాలు ఆలస్యమైందని గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థిని గేట్ లోపలికి పోలీసులు అనుమతించలేదు. అధికారులను బతిమిలాడినప్పటికీ లోపలికి అనుమతించకపోవడంతో గ్రూప్ వన్ అభ్యర్థి కంటతడి పెట్టుకుంది. ఇన్ని రోజుల నుంచి కష్టపడి చదివాను పరీక్ష రాయడానికి వస్తే టైం అయిపోయింది. అంటూ లోపలికి అనుమతించకపోవడంతో బాధ కలిగిందని గ్రూప్ వన్ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేసింది.