జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలలో మెరిసిన సింగపూర్ విద్యార్థి
శంకర్ పల్లి జూన్ 09(ప్రజాక్షేత్రం): జాతీయ స్థాయిలో పేరుందిన విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో శంకర్‌పల్లి మున్సిపల్ సింగపూర్ వార్డుకు చెందిన మర్రి రోహిత్ రెడ్డి సత్తా చార్చాడు. నిన్న విడుదలైనటువంటి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో రోహిత్ రెడ్డి 2672 ర్యాంకును సాధించాడు. సింగాపురం వార్డుకు చెందిన మర్రి అంజిరెడ్డి వరలక్ష్మి ల కుమారుడు జాతీయస్థాయిలో 2672 ర్యాంకు సాధించి అందర్నీ అబ్బురపరిచాడు. కూకట్పల్లి లోని శ్రీ చైతన్య ప్రతిభ క్యాంపస్ లో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి గత నెల లో జరిగిన జై అడ్వాన్సుడ్ పరీక్ష రాశాడు. ఇంటర్మీడియట్ లో 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించాడు. ఈ విధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సంపాదించినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు అభినందించడం జరిగింది.