5 సంవత్సరాలు అవమానాలు ఎదుర్కొని మండలాన్ని అభివృద్ధి చేశా : ఎంపీపీ మనోజ్ రెడ్డి
*సర్వసభ్య సమావేశమా..సన్మాన కార్యక్రమమా?*
*ఎలా నిర్వహించాలో అధికారులకు తెలియదా?*
కొండాపూర్ జూన్ 10 (ప్రజాక్షేత్రం): మండల కేంద్రం లో సోమవారం రోజు సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు,అధికారులు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉండగా కొంత సమయం సమావేశానికి ఏర్పాటు చేసి అనంతరం జులై 3 తో ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తుందని సర్వసభ్య సమావేశం తో పాటు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు అవమానాలు ఎదుర్కొని మండలంలో అనేక అభివృద్ధి పనులతో పాటు మండలానికి గ్రామాలకు జిల్లా స్థాయి అవార్డులు తీసుకురావడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో మండల ప్రజలు ఎంతో ఇబ్బందితో ఉన్న సమయంలో మండల ప్రభుత్వ ఆసుపత్రికి తన సొంత డబ్బుతో అభివృద్ధి కొరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు.తనకు సహకరించి తనతో ఉన్నవారందరికీఅలాగే మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మాజీ సర్పంచులు, సామాన్య ప్రజలు,గ్రామల పంచాయతీ కార్యదర్శులు కూడా సమావేశంలో హాజరు కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం సర్వసభ్య సమావేశాన్ని అధికారులు నిర్వహించకుండా,ప్రజల సమస్యలపై చర్చించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని హాజరుకాని ఎంపిటిసిలు అసహనం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి డిప్యూటీ తాసిల్దార్ మర్రి ప్రదీప్, మండల విద్యాధికారి బీమ్ సింగ్, ఎంపీటీసీలతో పాటు వివిధ గ్రామాల కార్యదర్శులు.సొసైటీ చైర్మన్లు.మాజీ సర్పంచులు.సామాన్య పౌరులు కూడా పాల్గొన్నారు.