ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి బడిబాట.
*సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి*
కొండాపూర్ జూన్ 10 (ప్రజాక్షేత్రం):
బడిబాటలో హాస్టల్ గడ్డ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల, ఇస్మాయిల్ ఖాన్ పేట ఉన్నత పాఠశాల తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రొఫిసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విద్యా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని , బడిబాట కార్యక్రమం విజయవంతం కోసం ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ,చిత్తశుద్ధితో పనిచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సంగారెడ్డి మండలంలోని హాస్టల్ గడ్డ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ ప్రాథమిక పాఠశాలను, చింతలపల్లి ప్రాథమిక పాఠశాలను, ఇస్మాయిల్ ఖాన్ పెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఇస్మాయిల్ ఖాన్ పెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు మెరుగైన విద్య అందించాలని ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు చేపట్టి ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పిల్లలకు అందించేది అన్నిటికంటే ముఖ్యమైనది చదువేనని అన్నారు .తల్లులకే పిల్లల చదువుపై మక్కువ ఎక్కువ గా ఉంటుందని అన్నారు . ఇంతకు ముందు ఇదే పాఠశాలల్లో చదివిన పిల్లల తల్లిదండ్రులను కలిసి , టీచర్స్ , కమిటీ సభ్యులు కలిసి ఇంటింటికి తిరిగి బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేవిధంగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వపాఠశాలలు ప్రయివేటుకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని , ఈ పనులన్నీ అమ్మఆదర్శపాఠశాలల కమిటీ సభ్యలకే బాధ్యత అప్పగించడం జరిగిందని అన్నారు . ప్రభుత్వపాఠశాల ల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులద్వారా నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని అన్నారు. ప్రయివేటు విద్యాసంస్థల కు పంపే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వపాఠశాల ల్లో చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపాలని,పిల్లలు బడికి ఎక్కువ రోజులు సెలవు పెడితే చదువుపై శ్రద్ద తగ్గుతుందని పిల్లలకు అన్నిటికంటే ముఖ్యమైనది చదువేనని అన్నారు. మధ్యాహ్న పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందిస్తున్నారలేదా , ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారలేదా పరిశీలించే బాధ్యత అమ్మఆదర్సా పాఠశాల కమిటీ సభ్యుల దేనని అన్నారు . బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఒకటవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 791 మంది విద్యార్థులు, రెండవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు 12వరకు ప్రభుత్వ పాఠశాలలో 585 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు విద్యాధికారులు , కలెక్టర్ కు తెలిపారు.ఈ కార్యక్రమంలో l జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు , డి ఆర్ డి ఓ పి డి జ్యోతి , టి ఎస్ ఈ డబ్ల్యు ఐ డి సి డిప్యూటీ ఈ ఈ రాంకుమార్ ,డి పి ఏం జయశ్రీనివాస్ , జెడ్పిటీసీ సునీత, ,ఏం ఈ ఓ వెంకటనర్సింలు , ఏం పి డి ఓ యాదగిరి రెడ్డి ,అమ్మఆదర్సా పాఠశాల కమిటీచెర్మన్ మన్నే అనసూజ, ప్రధానోపాధ్యాయులు సత్తుకొండ తదితరులు పాల్గొన్నారు.