వర్షాకాలం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి
*అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన*
*మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
బాలాపూర్ జూన్ 10 (ప్రజాక్షేత్రం): వర్షాకాలం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ఎన్నికలకు ముందు గతంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పనుల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా హెచ్ ఎండి ఏ , ఎస్ ఎన్ డి పి నాళాలు, మెయిన్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, స్ట్రీట్ లైటింగ్, త్రాగునీరు వంటి పలు అంశాలపై చర్చించారు.అసంపూర్తిగా ఎక్కడైనా పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్,రఘు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ సుర్న గంటి అర్జున్,కార్పొరేటర్లు భారతమ్మ కొమరయ్య యాదవ్,భీమిడి స్వప్న జంగారెడ్డి,లిక్కి మమతా కృష్ణారెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి,సమ్ రెడ్డి స్వప్న వెంకటరెడ్డి,ముత్యాల లలిత కృష్ణ, కవిత రామ్ రెడ్డి,రోహిణి రమేష్,పెద్దబావి శ్రీనివాసరెడ్డి, ఏనుగు రామిరెడ్డి సుక్కా శివకుమార్,యాతం పవన్ యాదవ్,కోఆప్షన్ సభ్యులు రఘునందన్ చారి,మర్రి జగన్మోహన్ రెడ్డి,ఎస్కే ఖలీల్ పాషా,సమైక్య జ్యోతి అశోక్, అధికారులు హెచ్ఎం డబ్ల్యూ డి ఈ హరీష్, మున్సిపల్ కార్పొరేషన్ డిఈ జ్యోతి రెడ్డి, ఆర్వో చంద్రశేఖర్ రెడ్డి,ఏ ఈ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.