గద్వాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను కోరిన గద్వాల జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య
హైదరాబాద్ జూన్ 11(ప్రజాక్షేత్రం):డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యలు సీతక్కని జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్, గద్వాల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరిత తిరుపతయ్య మర్యాద పూర్వకంగా కలిసి,గద్వాల నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ లో గల నూతన సీసీ రోడ్లు, డ్రెయినేజీ,ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతి భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణం పలు అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయాలని మంత్రి సీతక్కను జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య కోరారు.. అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా శానిటేషన్ లను పంచాయతి లకు అందించేందుకు గాను కృషి చేయాలని వినతిపత్రంలో సీతక్కకు సరితమ్మ తెలిపారు.