కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీపై కాంగ్రెస్ కసరత్తు
హైదరాబాద్ జూన్ 11 (ప్రజాక్షేత్రం):దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసింది.. ఫలితాలు కూడా వచ్చేశా య్. తెలంగాణలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పాలనతో పాటు కార్పొరేష న్ ఛైర్మన్ పదవులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే కార్పొరేషన్ ఛైర్మన్ నియమకాలు ఉంటుందనే చర్చ గాంధీ భవన్ వేదికగా జరుగు తోంది. మరో వైపు ఆశావహులంతా సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ ముగియ డంతో వీలైనంత త్వరగా అన్ని రకాల పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు స్టార్ట్ చేసింది. గతంలో ఎన్నికల కోడ్‌కు ఒక్క రోజు ముందే 37 మంది నేతలను కార్పొ రేషన్ ఛైర్మన్లుగా నియమి స్తూ ప్రభుత్వం ఓ హింట్ ఇచ్చింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అధికారికంగా జీవో రిలీజ్ కాలేదు. అయితే గతంలో ఇచ్చిన 37 కార్పొరేషన్‌లకు తోడు గా మరో 17 కార్పొరేషన్ ఛైర్మన్లను నియమించే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.