ఆశాలకు ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి
-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
చేవెళ్ల జూన్ 11 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు గత 33 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని ఆశా కార్యకర్తల పని ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగులు పొందారని రిజిస్టర్స్ రాయడం సర్వేలు చేయడం ఆన్లైన్ పని బీపీ షుగర్ థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారు. వీటితోపాటు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు ఇతర ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని డబుల్ఎచ్ఓ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశ వర్కర్లకు అవార్డు ప్రకటించినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టాలని చూస్తుందని దానిని రద్దు చేయాలని లేని పక్షంలో 13వ తారీఖున జరిగే కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసి కలెక్టర్ కార్యాలయం దిగ్బంధం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు చేవెళ్ల మండల అధ్యక్ష కార్యదర్శులు అన్నపూర్ణ విజయలక్ష్మి కోశాధికారి ఉమా మంజుల శాంత సుజాత పావని సుజాత శోభారాణి తదితరులు పాల్గొన్నారు.