Praja Kshetram
తెలంగాణ

సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులతో మంచి ఆరోగ్యం.

సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులతో మంచి ఆరోగ్యం.

-జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ.

కొండాపూర్ జూన్ 11(ప్రజాక్షేత్రం):
కొండాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు శాస్త్రవేత్తలతోపంట సాగు,వేసే విధానాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి విత్తనం ద్వారా రైతుల ఆదాయం పెంపు ఉంటుందని తెలియజేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ విధానంలో రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ నందు అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి పంట వేయడం ద్వారా ఎకరానికి మొక్కల సంఖ్య పెరగడంతో పాటుగా వాటి నుండి వచ్చిన కొమ్మల ద్వారా అత్యధిక సంఖ్యలో కాయలు, గుడలు రావడం ద్వారా ప్రతి పంట యొక్క దిగుబడి పెరిగి రైతుకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఈ పంట వితనం దగ్గర నుండి కోత వరకు వివిధ దశల్లో చేపట్టవలసిన సాంకేతిక అంశాల గూర్చి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ శాస్త్రవేత్త శ్రీ డాక్టర్ ప్రశాంత్ రైతులకు వివరించడం జరిగింది తదుపరి ఎలక్ట్రానిక్ వింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించినటువంటి వివిధ వీడియోలను యూట్యూబ్ ద్వారా అధిక సాంద్రత పద్ధతిలో పంట వేయి పద్ధతి, వేసినటువంటి రైతుల అనుభవాలను వీడియో రూపంలో ప్రదర్శించడం జరిగింది అనంతరం ఇంతకుముందు సీజన్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన శంకర్ అనే రైతు తన అనుభవాలను తనకు కలిగినటువంటి లాభాలను ఇతర రైతులతో పంచుకోవడం జరిగింది తదుపరి పద్మశ్రీ…శ్రీ చింతల వెంకటరెడ్డి అనే ఆదర్శ రైతు సివిఆర్ పద్ధతి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఉత్తమ రైతు తన పొలంలోని మట్టిని ఉపయోగించి మట్టిని వడగట్టి నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా చీడపీడలను కొంతవరకు పోషక పదార్థాలను అందించడంలో విజయవంతమైనటువంటి రైతు యొక్క విజయ గాధలు మిగతా రైతులతో తన అనుభవాలను పంచుకోవడం జరిగింది అదేవిధంగా తాను చేస్తున్నటువంటి వివిధ రకాల సేంద్రీయ పద్ధతులను ఇతర రైతులకు వివరించడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు వ్యవసాయ విజ్ఞానం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఈ రైతు నేస్తం కార్యక్రమం ప్రతి మంగళవారం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొని తమ వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కావలసినటువంటి విత్తనాలు మరియు ఎరువులను సరిపడా నిలువలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అదేవిధంగా ప్రతి పంట వేసేటువంటి రైతులు అన్ని బీటీ-2 విత్తన హైబ్రిడ్లు ఒకే రకమైనటువంటి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉందని దిగుబడి కేవలం పంట వేసేటువంటి పద్ధతి నేల స్వభావం వాతావరణ అనుకూలతలు ఎరువుల మరియు పోషక యజమాన్యం తో పాటుగా సరైన సమయంలో సరైన మోతాదులో పురుగుమందుల పిచికారి వల్ల మాత్రమే దిగుబడి పెరిగే అవకాశం ఉందని కావున రైతులు ఒకే రకం ప్రత్తి విత్తన రకం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం లేదని, ఈ విధానంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహనకల్పించాలని, అదేవిధంగా రైతులు తీసుకున్నటువంటి విత్తనానికి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులకు కావలసినటువంటి క్రాప్ క్యాలెండర్ ను రూపొందించి రైతులకు తగిన సమయంలో వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతులకు వివిధ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈరోజు కొండాపూర్ రైతు వేదికలో పై అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలో ముఖ్యంగా విత్తనాల లభ్యత ఎరువుల ల భ్యత రైతు బీమా పరిష్కారం అదే విధంగా వర్షాకాలంలో చేయదగినటువంటి పంట నమోదు కార్యక్రమం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, మండల వ్యవసాయ అధికారి గణేష్, మండల వ్యవసాయ సహాయ సంచాలకులు మనోహర్, వ్యవసాయ అధికారి ప్రతిభ, సంగారెడ్డి వ్యవసాయ డివిజన్ పరిధిలో గల వ్యవసాయ విస్తీర్ణాధికారులు మరియు మండల రైతులు పాల్గొన్నారు.

Related posts