అభివృద్ధి పేరుతో వందల కోట్ల రూపాయలు కేటాయిస్తాం
-గుడి కోసం కోట్ల రూపాయలు ఇస్తారు.
-బడి కోసం ఒక రూపాయి కూడా ఇవ్వడానికి ముందుకు రారు.
-ప్రతి ఒక్కరు చదువుకుంటే దేశ అభివృద్ధి సాధ్యం
-ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు ఎందుకు.
-ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి.
-మరి మన పిల్లల చదువుల కోసం బడికి ఎందుకు చందాలు ఇవ్వం
-ప్రతి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేయాలి.
-బడంగ్ పేటలో మొదటిసారిగా విద్యాభివృద్ధి కోసం 20 లక్షల కేటాయించాం
-ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలో విద్య కోసం నిధులు కేటాయించాలి.
-ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు బడుగు బలహీన వర్గాల వారే అని చిన్న చూపా.
-బడంగ్ పేట్ డిప్యూటీ మేయర్
ఇబ్రమ్ శేఖర్
బాలాపూర్ జూన్ 11(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు తో పాటు మెయింటెనెన్స్ కూడా చేయాలని బడంగ్ పేట డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు బడుగు బలహీన వర్గాల వారు ఉంటారని చిన్న చూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అరకొర నిధులతో కేటాయిస్తూ మెయింటెనెన్స్ ఏమాత్రం లేకుండా పాఠశాల అభివృద్ధి చెందాలంటే ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ లేరు, బాత్రూం శుభ్రం చేసేవారు లేరు, స్కై వెంజర్ లేరు మరి పాఠశాలలు ఎలా అభివృద్ధి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. మనదేశంలో పేదరికం నిర్మూలన కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువు ద్వారానే విజ్ఞానం ఉపాధి లభిస్తుంది అది అందరికీ తెలుసు కానీ మనం ఒక గుడికి కావాలంటే కోట్ల రూపాయలు చందాలు ఇస్తాం, బోనాల పండుగకు, ఇతర పండుగలకు ప్రభుత్వం తరఫున గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలు నిధులు కేటాయించి పండుగలు నిర్వహించుకోవడం జరుగుతుంది సంతోషం అంతా బాగానే ఉంది కానీ మరి ప్రభుత్వ పాఠశాలలకు చందాలు ఎందుకు ఇవ్వరు. చదువుకొని దేశం అభివృద్ధి చెందడం ఎవరికి ఇష్టం లేదా. లేదా పేదవారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు మాకు ఏంటి అని నిర్లక్ష్యమా… ఇప్పటివరకు బడంగ్ పేట పలు అభివృద్ధి పనుల కోసం 181 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఇందులో నుండి ఒక శాతం ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించిన ఎంతో అభివృద్ధి జరిగే వని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం గ్రామపంచాయతీ గాని మున్సిపాలిటీ గాని కార్పొరేషన్ గాని ఒక్క రూపాయి నిధులు కేటాయించడం లేదు మరి పాఠశాల అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఎవరికి అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ లేక ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతు ఎన్నో రోగాలు వస్తున్న పట్టించుకోని వైనం మన దౌర్భాగ్యం తయారయింది కొన్ని పాఠశాలలో టాయిలెట్ కట్టించిన శుభ్రం చేసేవారు లేక విద్యార్థులు వాడలేకపోతున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఎవరైనా ముందుకొస్తున్నారా అంటే అది లేదు ఇంకా ఎంతకాలం ప్రభుత్వ పాఠశాలల వివక్షత, ఎంతకాలం విద్యార్థులు ఇబ్బందులు పడాలి, ఇంకా ఎంతకాలం ఈ సమస్యలను ఎదురుకోవాలి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చెందే వరకు నా పోరాటం ఆగదని ఇబ్రామ్ శేఖర్ అన్నారు.
ఇకనైనా ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఆశించకుండా గ్రామపంచాయతీ నుంచి సర్పంచి వార్డ్ మెంబర్, మున్సిపాలిటీ నుంచి చైర్మన్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ నుంచి మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయాలని ఇబ్రమ్ శేఖర్ కోరారు.ప్రభుత్వ పాఠశాలల మార్పు వచ్చే వరకు నా పోరాటం ఆగదని ఇబ్రమ్ శేఖర్ అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు తనిఖీ చేయరని ఆయన ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ప్రతి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్, డీఈఓ బాధ్యతగా చొరవ తీసుకొని పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇబ్రమ్ శేఖర్ కోరారు.