Praja Kshetram
తెలంగాణ

ఆధ్వనాగ్గా రోడ్డు ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఆధ్వనాగ్గా రోడ్డు ప్రయాణికులకు తప్పని తిప్పలు

-పొంచి ఉన్న ప్రమాదం..చూసిచూడనట్లుగా అధికారులు.

-కందవాడ పల్గుట్ట నుండి హైదరాబాద్ మార్గంలో వెళ్లే గ్రామస్తులకు తప్పని కష్టాలు.

-రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్న కందవాడ పల్గుట్ట గ్రామస్తులు

చేవెళ్ల జూన్ 11(ప్రజాక్షేత్రం): ఒకవైపు రోడ్లన్నీ బాగుచేస్తున్నాం అని ప్రజాప్రతినిధులు అంటుంటే,మరోవైపు మాత్రం రోడ్ల పరిస్థితి ఇంకోలా ఉంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లే రహదారులు అయితే గోరంగా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి,అటు ప్రయాణికులకు,ఇటు వాహనదారులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. వివరాల్లోకి వెలితే మండలంలోని కందవాడ పల్గుట్ట నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్డు పెద్ద ఎత్తున గుంతలు పడి,పూర్తిగా ఆధ్వన్నగా అయినది రాకపోకలకు వీలు లేకుండ అయినది గానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్త వాహనాలు వస్తే రాత్రిపూట పయనిఛాలంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కందవాడ పల్గుట్ట గ్రామాలలో ఎక్కువగా రైతులు నిత్యం కూరగాయలు హైదరాబాద్ తీసుకోని వెళ్ళాలి చాలా మంది హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తూ ప్రతి రోజు ఈరోడు గుండ ప్రయాణికులు ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రయాణిచల్సిందే ప్రజా ప్రతినిధులు కేవలం ఓట్ల సమయంలోనే గ్రామాల అభివృద్ధిపై హామీలు ఇస్తూ పబ్బం గడుపుతున్నారే తప్ప రోడ్లకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని వాహనదారులు,ప్రజలు ఆవేదన చెందుతున్నారు.రోడ్లు ఇప్పుడే ఇలా అయితే మున్ముందు భారీ వర్షాలు కురిస్తే రోడ్ల పరిస్థితి ఇంకేలా ఉంటుందో అని,ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండ చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts