Praja Kshetram
పాలిటిక్స్

అభివృద్ధి పనులకు ఆలస్యం వద్ద

అభివృద్ధి పనులకు ఆలస్యం వద్ద

 

-కమిషనర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన

-మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 

మహేశ్వరం జూన్ 11 (ప్రజాక్షేత్రం) వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నివాసంలో తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన కమిషనర్, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులు మున్సిపాలిటీలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు తీరు అదేవిధంగా ఎన్నికల కంటే ముందు శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల తీరు ఎక్కడైతే అభివృద్ధి పనులు నిలిచిపోయాయో తక్షణమే అట్టి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్డు లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్ సిస్టం, పలు అంశాలపై చర్చించారు.అదేవిధంగా వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రజలకు అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రవి నాయక్, సప్పుడు లావణ్య రాజు,రెడ్డిగళ్ల సుమన్, పార్టీ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజు, బంటు రమేష్,సురేష్,శ్రీలక్ష్మిక మిషనర్ వెంకట్రామ్,డిఈఏ ఇతర అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts