Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రమాణస్వీకార సందడి.. చంద్రబాబు ఇంటికి అమిత్ షా

చంద్రబాబు ప్రమాణస్వీకార సందడి.. చంద్రబాబు ఇంటికి అమిత్ షా

 

విజయవాడ జూన్ 11 (ప్రజాక్షేత్రం): ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవ సందడి నెలకొంది. బుధవారం ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నారా, నందమూరి, మెగా కుటుంబ సభ్యుల్లో పలువురు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఏపీ చేరుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్వాగతం పలికారు. బీజేపీ నేతలు సీఎం రమేశ్, సుజనా చౌదరి కూడా స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
కాగా చంద్రబాబు ఇంటికి అమిత్ షా బయలుదేరారు. చంద్రబాబు నివాసం విందు చేయనున్నారు. ఇక బుధవారం విజయవాడలో జరగనున్న స్వీకారోత్సవానికి అమిత్ షా హాజరుకానున్నారు. మరోవైపు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.

Related posts