Praja Kshetram
తెలంగాణ

గ్రంథాలయంలో వసతులు కల్పించాలని రోడెక్కిన నిరుద్యోగులు

గ్రంథాలయంలో వసతులు కల్పించాలని రోడెక్కిన నిరుద్యోగులు

 

ఖమ్మం జూన్ 12 (ప్రజాక్షేత్రం): ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. తాగునీరు, టాయిలెట్స్, కూర్చోని చదువడానికి కుర్చీలు లేక ఇక్కడకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం అలసత్వం వీడి వసతులపై దృష్టి పెట్టాలన్నారు. వెంటనే వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై బైఠాయించారు. పోలీసులు వచ్చి వారికి సర్ది చెప్పినా నిరుద్యోగులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts