విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ కి తెరలేపిన కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు
– ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు)
చేవెళ్ల జూన్ 13 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా సంవత్సరం మొదలు కావడం తో పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీకి తెరలేపారని , అదేవిధంగా శంకర్పల్లి మండల కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ , నారాయణ స్కూల్, రావు స్కూల్, రేవతి స్కూల్, వివేకానంద స్కూల్ యాజమాన్యం విచ్చలవిడిగా ఫీజులు పెంచాడన్నీ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసిస్తూ మా దృష్టికి తీసుకు వచ్చారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం. (పి డి ఎస్ యు) చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు కొజ్జంకి జైపాల్, ఉపాధ్యక్షుడు న్యాలట అశోక్ అన్నారు. ఇంత ఫీజుల భారం మోపితే ఏలా కట్టాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.అని ప్రైవేట్ పాఠశాలలా యాజమాన్యాలు యూనిఫార్మ్స్,బుక్స్ , ఇలాంటి రకరకాల పేరుతో ఫీజుల దోపిడీకి తెరలేపారని పాఠశాలలను విద్యార్థులకు విద్య బోధనలు చెప్పేందుకు ఏర్పాటు చేసినట్టు కాకుండా విద్యా పేరుతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఉంది. అని అన్నారు. యూకేజీ పుస్తకాల కు రూ, 1650 /- తీసుకుంటుండగా ఒకటవ తరగతి పుస్తకాలకు రూ, 3400/- తీసుకుంటున్నారు. కేవలం ఈ పాఠశాలలోనే కాదు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా పెద్ద ఎత్తున ఫీజులను దండుకుంటున్నారని అన్నారు.
ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్, షూస్, అమ్మకూడదు అని ఉత్తర్వులు జారీ చేసిన వాటిని లెక్క చేయకుండా పాఠశాలలో యూనిఫార్మ్స్, బుక్స్, షూస్, అమ్ముతూ వ్యాపారాన్నీ కొనసాగిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం. తూతూ మంత్రంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) తనిఖీలు నిర్వహిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల్లో షూస్, యూనిఫార్మ్స్, పుస్తకాలు, అమ్ముతున్నారని తెలిసిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ వారికి అనుకూలంగా ఉంటున్నారని పిడిఎస్ యు డివిజన్ అధ్యక్షుడు కొజ్జంకి జైపాల్, ఉపాధ్యక్షుడు న్యాలట అశోక్, ఆరోపించారు. యూనిఫార్మ్స్, షూస్, బుక్స్, విక్రయిస్తున్న స్కూల్స్ ముందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.(పి డి ఎస్ యు )ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం అని అన్నారు.