విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్
శంకర్ పల్లి జూన్ 13(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధి తెలంగాణ మోడల్ స్కూల్, ప్రాథమిక పాఠశాలను మునిసిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ శ్వేతా పాండురంగారెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండగ వాతావరణంలో పాఠశాల పున:ప్రారంభం చేసుకోవడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, నోటు పుస్తకాలను వైస్ ఛైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డా. ఉమామహేశ్వర రావు, మునిసిపల్ మేనేజర్ అంజన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.