Praja Kshetram
తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్

 

-రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను సందర్శించిన ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్

-రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

-ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు

నిబంధనలు పాటించి వాహనాలు నడపాలి

 

సిద్దిపేట జిల్లా జూన్ 13 (ప్రజాక్షేత్రం):ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్ఐ వినయ్ సాగర్ సిబ్బందితో కలిసి సిద్దిపేట పట్టణంలో రాజీవ్ రహదారి పరిసర ప్రాంతాలలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోతున్న బ్లాక్ స్పాట్స్ కుంకుమ మిల్లు చౌరస్తా, రంగీలా దాబా చౌరస్తా, రాజీవ్ రహదారి సిఏఆర్ హెడ్ క్వార్టర్ చౌరస్తా, సిరిసిల్ల రోడ్డు రేణుక ఎల్లమ్మ టెంపుల్ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా ప్రదేశాలను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఆదేశానుసారం గురువారం రోజు సందర్శించారు. ప్రమాదాల నివారణ గురించి తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలు తదితర అంశాల గురించి పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సుమన్ కుమార్ మాట్లాడుతూ, ప్రమాదాల నివారణ గురించి త్వరలో ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సైన్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక సిగ్నల్స్ రంబుల్‌ స్ట్రిప్స్‌, ఇల్యూమినేషన్‌ టవర్లు, ఏర్పాటు చేయడం గురించి పోలీస్ కమిషనర్ ద్వారా ఆర్అండ్బి, హెచ్కేఆర్ డిపార్ట్మెంట్కు నివేదికలు పంపిస్తామని త్వరలో పనులు పూర్తయ్యాలా కృషి చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ తెలిపారు.

Related posts