Praja Kshetram
తెలంగాణ

ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్

ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్

 

 

హైదరాబాద్ జూన్ 13 (ప్రజాక్షేత్రం): లంచం తీసుకుంటూ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో సుధాకర్ మూడు లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని సుధాకర్ నగదు తీసుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం సీసీఎస్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

Related posts