Praja Kshetram
క్రైమ్ న్యూస్

పిడుగుపాటుకు మహిళా కూలీ మృతి మరొకరికి తీవ్ర గాయాలు

పిడుగుపాటుకు మహిళా కూలీ మృతి మరొకరికి తీవ్ర గాయాలు

 

-కరణ్ కోట్ గ్రామంలో తీవ్ర విషాదం

 

తాండూరు జూన్ 13 (ప్రజాక్షేత్రం):పిడుగుపాటుకు గురైన మహిళ కూలీ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని గురువారం చోటుచేసుకుంది.కరణ్ కోట్ పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన్ మహేష్ అనే యువకుడితో ఏడాది క్రితం దుద్యాలకు చెందిన మధులత(21)తో వివాహము జరిగింది. వృత్తి వ్యవసాయ కూలీ కరెంట్ కోట్ గ్రామ శివారులో మాజీ ఎంపీపీ శరణుబసప్ప చెందిన పొలం వెనకాల ఎంకేపల్లి నరసయ్య గౌడనే వ్యక్తి కౌలుకు తీసుకొని వ్యవసాయం సాగిస్తున్నాడు. గురువారం పొలంలో పత్తి గింజలు నాటేందుకు చేసేందుకు 20 మంది కూలీలకు మాట్లాడుకున్నారు.

ఈ కూలీలలో కలసి మధులత, దస్తమ్మ కూడా పనులకు వచ్చారు. సాయంత్రం వేళ ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమయ్యింది. కూలీలందరు ఓ వైపు వస్తున్నారు. అప్పుడే పొలం సమీపంలో పిడుగు పడింది. దీంతో మధులత, దస్తమ్మలు కుప్పకూలీ పడిపోయారు. గమనించిన కౌలు యజమాని నర్సయ్య గౌడ్, కూలీలు ఆటోలో చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మధులత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో యువతి దస్తమ్మ తీవ్రగాయాలై ప్రాణాలతో బయటపడింది. మధులత మరణంతో కుటుంభీకులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ శరణు బసప్ప, గ్రామ నాయకులు జిల్లా ఆసుపత్రికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

Related posts