Praja Kshetram
పాలిటిక్స్

కేసీఆర్‌కు ఆ నోటీసులు ఇస్తారా.. దాసోజ్ శ్రావణ్ సూటి ప్రశ్న

హైదరాబాద్ జూన్ 13 (ప్రజాక్షేత్రం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ (గురువారం) బహిరంగ లేఖ రాశారు. పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా మీ పరిపాలన చాల అధ్వాన్నంగా మారిందని అన్నారు. విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించిన మాజీ కేసీఆర్‌కు సంజాయిషీ నోటీసులా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకు సంజాయిషీ నోటీసులా? అని నిలదీశారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి , మీ ప్రతీకార రాజకీయాలను పక్కనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని దాసోజ్ శ్రావణ్ హితవు పలికారు.

Related posts