పరీక్షను రద్దు చేయాలి
-సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ
-కలెక్టరేట్ ముందు ఆశ వర్కర్ల ధర్నా
గద్వాల న్యూటౌన్, జూన్ 13 (ప్రజాక్షేత్రం): ఆశ వర్కర్లకు పరీక్షను రద్దు చేయా లని, రూ. 18 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం వారు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ మాట్లాడుతూ 2023లో సమ్మె సందర్బంగా ఆశ వర్కర్ల యూనియన్‌తో అప్పటి ప్రభుత్వం చర్చ లు జరిపిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున సమ్మెను వాయిదా వేయాలని, ఆ తర్వాత సమస్యను పరిష్కరిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతిపత్రం సమర్పిం చారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సునిత, ఆశ కార్యకర్తలు పద్మ, కాంతమ్మ, మాధవి, సరస్వతి, సుజాత, విజయమ్మ, నాగేశ్వరమ్మ, మమత, నాగప్రమీల తదితరులు పాల్గొన్నారు.