నారా వారి చేతుల్లోనే ఆ జీవో.. నారాయణ షాకింగ్ కామెంట్స్
అమరావతి జూన్13 (ప్రజాక్షేత్రం): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఐదు కీలక ఫైళ్లపై సంతకం చేశారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నష్టపోయిన ప్రజలు, రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.
*జగన్ ఖాతరు చేయలేదు..*
అయితే ‘‘జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష’’ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. ఈ విషయంపై చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభినందనలు తెలిపారు. ‘‘నా భూమిపై నీ ఫొటో ఏంటని రాష్ట్ర రైతులంతా నిరసన చేసిన జగన్ ఖాతరు చేయలేదు.. చివరకు నారా వారి చేతులతోనే జగన్ జీవో నరకబడింది’’ తెలంగాణలో ధరణి భూ పథకంతో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పతనం లాగానే.. ‘‘జగన్ భూ రక్షణ’’ పథకం వల్లే జగన్ ప్రభుత్వం కూలిపోతుంది అని గత సంవత్సరం డిసెంబర్‌లో నేను ఓ వీడియో విడుదల చేశా. ఇప్పుడు అందరి గుర్తు కోసం మరలా తిరిగి ఆ వీడియో రీ పోస్ట్ చేస్తున్నా’’ అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.