ఎమ్మెల్సీ గా తీన్మార్ మల్లన్న ప్రమాణం స్వీకారం
హైదరాబాద్ జూన్ 13 (ప్రజాక్షేత్రం): వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందిన ఆయనతో శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ, తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ కు ,ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు..