Praja Kshetram
క్రైమ్ న్యూస్

వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెచ్చి వ్యభిచారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెచ్చి వ్యభిచారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

 

 

 

హైదరాబాద్ జూన్ 13 (ప్రజాక్షేత్రం): హైదరాబాద్‌లో హైటెక్‌ వ్యభిచారం గుట్టురట్టయ్యింది. బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

న‌గ‌రంలోని ఎస్సార్ న‌గ‌ర్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో వ్య‌భిచార దందా నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో బుధ‌వారం రాత్రి ఓ హోట‌ల్‌లో త‌నిఖీలు నిర్వ‌హించి, వ్య‌భిచార ముఠాను అరెస్టు చేశారు. ఆరుగురు మ‌హిళ‌ల‌ను రెస్క్యూ హోంకు త‌ర‌లించారు. అరెస్టు అయిన వారిలో సూర్య కుమారి అలియాస్ రాణి(38), కే విజ‌య శేఖ‌ర్ రెడ్డి(49), అర్కోకిట్ ముఖ‌ర్జీ(30) ఉన్నారు. మ‌రో ఇద్ద‌రు త‌ప్పించుకున్నారు. రాణి శేఖ‌ర్ రెడ్డి, ముఖ‌ర్జీతో క‌లిసి వెస్ట్ బెంగాల్, త్రిపుర‌, ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల నుంచి అమ్మాయిల‌ను తీసుకొచ్చి వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. ఈ యువ‌తుల‌కు ఎస్సార్ న‌గ‌ర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఆశ్ర‌యం క‌ల్పించారు. క్ల‌యింట్ల కోరిక మేర‌కు ఆ యువ‌తుల‌ను హోట‌ల్స్‌కు, ప్ర‌యివేటు ఫామ్ హౌజ్‌ల‌కు త‌ర‌లిస్తున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. నిందితుల నుంచి రూ.89 వేల నగదు, 22 చెక్కులు, 2 బైక్‌లు, 2 కార్లు, 18 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Related posts