కేసీఆర్ ఫొటో తొలగించాలన్న ఆలోచన సరికాదు: సబిత
హైదరాబాద్ జూన్ 13 (ప్రజాక్షేత్రం): తెలుగు పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకొని కేసీఆర్ ఫొటో, గుర్తులు తొలగించాలన్న ఆలోచన సరికాదని విద్యాశాఖ మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. జయలలిత బొమ్మలు ఉన్న బ్యాగులను స్టాలిన్, జగన్ ఫొటోలు ఉన్న కిట్లను చంద్రబాబు అనుమతించారని గుర్తుచేశారు. కేసీఆర్ పేరుందని చింపిన పేజీల వెనుక జాతీయగీతం, ప్రతిజ్ఞ ఉన్నా పట్టింపు లేదా అని మండిపడ్డారు. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించి పాలనపై దృష్టి పెట్టాలని సబిత హితవు పలికారు.
