Praja Kshetram
క్రైమ్ న్యూస్

వ్యక్తి దారుణ హత్యరెండు రోజుల్లో..రెండు హత్యలు..

వ్యక్తి దారుణ హత్యరెండు రోజుల్లో..రెండు హత్యలు..

 

 

చేవెళ్ల జూన్ 14 (ప్రజాక్షేత్రం): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడ్ పల్లి గ్రామానికి చెందిన రూల ఖాన్(58) తన ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి తరువాత 2 నుంచి 3 గంటల ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు మూడు బైక్, స్కూటీ లపై వచ్చి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు రూల ఖాన్ కుమార్తె కుమారుడు ఉన్నారు. గ్రామంలో కొంత భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు డబ్బులు ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు అల్లుడే ఈ గతుకానికి పాల్పడినట్లు సమాచారం గ్రామసతస్తులు ఇంట్లో గొడవ జరిగినట్లు చెబుతున్నారు రాత్రి హత్య అనంతరం నిద్దితులు పారిపోతుంటే పట్టుకొని ఎవరని ప్రశ్నిచగా వాలు తెచ్చిన మోటార్ బైక్ అక్కడే వదిలేసి పారిపోయారని గ్రామస్తులు తెలిపారు. హంతకులు తప్పిoచుకోగా వారి వాహనం వదిలి వెళ్లారు. వీరు నగరం నుంచి వచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు నగరంలో ఉంటారు. ఇక్కడ రూలఖాన్ ఒకరే ఉండడంతో హంతకులు చంపి వెళ్లారని గ్రామస్తులు గుర్తిoచిన్నట్లు సమాచారం. సొంత అల్లుడు ఈ ఘతుకానికి పాల్పడినట్లు విశ్వనీయ సమాచారo.

రెండు రోజుల్లో..
రెండు హత్యలు..

గడిచిన రెండు రోజులు గా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మర్డర్ లు జరిగాయి తలారం గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న విల్లాలో పని నిమిత్తం వచ్చి పాతకాక్షలతో మహిళా హత్య విషయం మరువకముందే ఇలా జరగడం చుట్టూ పక్క గ్రామస్తులు భయందోళన చెండుతున్నారు. ఇకనైనా పోలీస్ సిబ్బంది గ్రామాలపై రాత్రివేళ లో నిఘా పెంచాలని తెలిపారు చేవెళ్ల మండలంలో అడ్డ గోళ్లు గా ఫామ్ హౌస్ లు ఏర్పాటు చేయడం వాటిలో ఏం జరుగుతుందో తెలియక పోవడం.. విల్లాలు నిర్మాణం చేస్తున్నారు, వాటిలో ఇతర ప్రాంతాలకు చెందిన లేబర్ పనులకు రావడం క్షణికావేశoతో దారుణలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా గ్రామాల వారీగా పోలీస్ లు నిఘా పెంచాలని గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గడిచిన రెండు రోజులు గా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మర్డర్ లు జరిగాయి. పోలీస్ లు గస్తీ తిరగక పోవడం.. గ్రామాలపై రాత్రివేళ లో నిఘా లేకపోవడం తో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. చేవెళ్ల మండలంలో అడ్డ గోళ్లు గా ఫామ్ హౌస్ లు ఏర్పాటు చేయడం వాటి లో ఏం జరుగుతుందో తెలియక పోవడం.. విల్లా లు నిర్మాణం చేస్తున్నారు, వాటి లో ఇతర ప్రాంతాలకు చెందిన లేబర్ పనులకు రావడం క్షణికావేశo తో దారుణలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా గ్రామాల వారీగా ఉన్న పోలీస్ లు నిఘా పెంచాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts