ప్రొద్దుటూరు ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అక్షరాభ్యాసం
శంకర్ పల్లి జూన్ 14 (ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి హాజరై అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు. వైస్ ఎంపీపీ సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులతో పలకలపై అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ప్రవళిక మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులచే మెరుగైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఏపీసి అధ్యక్షురాలు లక్ష్మి, ఉపాధ్యాయులు అరిఫ్ పాష, నరేందర్ రెడ్డి, కృష్ణ ఉన్నారు.