Praja Kshetram
క్రైమ్ న్యూస్

కొల్లూరు బస్ స్టాప్ వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

కొల్లూరు బస్ స్టాప్ వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

 

 

 

శంకర్‌ పల్లి జూన్ 14 (ప్రజాక్షేత్రం): నార్సింగి వైపు నుండి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సప్లైయర్లను మోకిల పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధి కొల్లూరు బస్ స్టాప్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులైన బాబు హల్దార్ (40), సుఖ చంద్ర పోడర్ (35) లను తనిఖీ చేయగా వారి వద్ద 4 కిలోల గంజాయి లభ్యమైంది. వారిద్దరిని అరెస్టు చేసి గంజాయిని, సెల్ ఫోన్, రూ. 11 వందల నగదు, బైక్ (TS 08 EL1842) స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. వారిద్దరు సెంట్రింగ్ పని చేస్తారని ఒరిస్సా రాష్ట్రం నుండి తక్కువ ధరకు తీసుకొని వచ్చి అట్టి గంజాయిని హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతారని సీఐ వీరబాబు గౌడ్ పేర్కొన్నారు.

Related posts