Praja Kshetram
పాలిటిక్స్

శనివారం శంకర్‌పల్లికి రానున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శనివారం శంకర్‌పల్లికి రానున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

 

 

 

శంకర్‌ పల్లి జూన్ 14 (ప్రజాక్షేత్రం): నేడు శంకర్‌ పల్లి పట్టణ కేంద్రానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రానున్నారని శంకర్ పల్లి మండల ఎంపిపి ధర్మనాగారి గోవర్ధన్ రెడ్డి, బీజేపీ మండల, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్, సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం మాట్లాడుతూ బిజెపి చేవెళ్ల గడ్డపై ఘన విజయం సాధించినందుకు మునిసిపల్ పరిధిలోని రామంతాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి శంకర్‌పల్లి ప్రధాన చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం సంగారెడ్డి రోడ్డు లో గల మనీ గార్డెన్ లో సన్మాన సభ ఉంటుందని, మండల, మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Related posts