కార్మికుల శ్రమను గుర్తించాలి : శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్
శంకర్ పల్లి జూన్ 14 (ప్రజాక్షేత్రం):
పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించాలని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రేడియం జాకెట్లతో పాటు ఇతర సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రజా ఆరోగ్య కోసం అహర్నిశలు పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు రాధా బాలకృష్ణ, చంద్రమౌళి, శ్రీనాథ్ గౌడ్, శ్వేత పాండురంగారెడ్డి, గోపాల్, కోఆప్షన్ సభ్యురాలు రజిని శ్రీనివాస్, మేనేజర్ అంజనీ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.