Praja Kshetram
తెలంగాణ

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

 

శంకర్‌ పల్లి జూన్ 15 (ప్రజాక్షేత్రం): ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి శంకర్‌ పల్లి పట్టణ కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మనీ గార్డెన్ లో జరిగిన విజయోత్సవ సభలో ఎంపీ పాల్గొన్నారు.శంకర్ పల్లి మండల ఎంపిపి ధర్మనాగారి గోవర్ధన్ రెడ్డి ఎంపీని శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, మాజీ ఎంపీపీ నరసింహ, మున్సిపల్ అధ్యక్షుడు సురేష్, మునిసిపల్ ఇంచార్జ్ వాసుదేవ్ కన్నా, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, భయానంద్, రాజ్ కుమార్,భావాని నందు, సతీష్ రెడ్డి, అజయ్ గౌడ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts