Praja Kshetram
తెలంగాణ

చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రినీ సందర్శించిన.. చేవెళ్ళ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్.

చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రినీ సందర్శించిన.. చేవెళ్ళ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్.

 

చేవెళ్ల జూన్ 16 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని ప్రమాదం చోటు డయాలసిస్ సెంటర్లలోని పరికరాలు కాలిపోయాయి. చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్ ఆసుపత్రిని సందర్శించి షార్ట్ సర్క్యూట్ గల కారణాలను ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న రోగులకు భయాందోళనకు గురి కావొద్దని ధైర్యం చెప్పారు. షార్ట్ సర్క్యూట్ గల కారణాలు ఏంటో పరిశీలిస్తున్నామని తెలిపారు. డయాలసిస్ రోగులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహా ను త్వరలో కలిసి చేవెళ్లలో 100 పడకల ఆసుపత్రి మంజూరైన విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చేవెళ్లలో 100 పడకల ఆసుపత్రికి కృషి చేస్తామని తెలిపారు. ఆసుపత్రిని పరిశీలించిన వారిలో టీపీసిసి ప్రచార కమిటీ సున్నం వసంతo, మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, టిపిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు పాండు, ఎంపీటీసీ గుండాల రాములు, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ పెంటయ్య గౌడ్, నాయకులు మాణిక్యం, మంగలి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related posts