Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

 

 

అమరావతి జూన్ 16( ప్రజాక్షేత్రం): ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ను నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఏపీ టీడీపీకి అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో పల్లా శ్రీనివాసరావు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

*సమర్థవంతంగా పనిచేయలి: ఛంద్రబాబు*

విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో చాలా సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

*పల్లా శ్రీనివాసరావు నియమకంతో..*

అయితే ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో పల్లా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాను చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు వ్యవహరించిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ అధ్యక్షునిగా వేరే వారిని నియమించాలని చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావును నియమించడంతో టీడీపీ కేడర్ అభినందనలు చెబుతున్నారు.

Related posts