Praja Kshetram
తెలంగాణ

తప్పు చేసిన వారిని వదలొద్దని సూచన

తప్పు చేసిన వారిని వదలొద్దని సూచన

 

 

హైదరాబాద్ జూన్ 16 (ప్రజాక్షేత్రం): మెదక్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ ఘర్షణల పూర్వాపరాలను బండి సంజయ్‌ అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికీ కొమ్ముకాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడటమే కాకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించడంకానీ, అమయాకులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను కానీ చేపట్టొద్దని సూచించారు. మెదక్ ఘటనలో పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయన్నారు. మెదక్‌లో గోవుల రవాణను అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగి అల్లర్లకు, పరస్పర దాడులకు దారితీసింది. ఇందుల్లో ఒకరు కత్తిపోట్లకు గురవ్వగా, మరో ఇద్దరు రాళ్లు, కర్రలతో జరిగిన దాడుల్లో గాయపడ్డారు. సంఘటనను నిరసిస్తూ బీజేపీ ఆదివారం మెదక్ పట్టణ బంద్ నిర్వహించింది. అలర్లు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Related posts