శంకర్ పల్లి మండలంలోని ప్రైవేటు పాఠశాలలలో పుస్తకాల దందా
శంకర్ పల్లి జూన్ 16(ప్రజాక్షేత్రం) శంకర్ పల్లి మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ స్కూల్స్ లో పుస్తకాల వ్యాపారం నడుస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.ఈ సందర్భంగా శంకర్ పల్లి మండల కేంద్రంలో గల పేరు మోసిన ప్రైవేటు పాఠశాలలలో స్కూల్ డ్రెస్ మొదలుకొని పుస్తకాల వరకు ప్రతిదీ పాఠశాలలో ఇస్తున్నారని వారు తెలిపారు. శంకర్ పల్లి మండల ఎంఈఓ అక్బరుద్దీన్ ప్రైవేటు పాఠశాలలో తనిఖీలు చేయకుండా పట్టించుకోవడంలేదని వారు తెలిపారు. శంకర్ పల్లికి సంబంధించిన విద్యార్థి నాయకులు ఎజాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను బేకర్త చేస్తూ ప్రైవేటు పాఠశాలలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ ప్రైవేటు రంగ దోపిడీని అరికట్టాలని వాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.