Praja Kshetram
తెలంగాణ

చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

— చేవెళ్లలో వంద పడకల ఆసుపత్రికోసం 17 కోట్లు మంజూరు.

చేవెళ్ల జూన్ 17 (ప్రజాక్షేత్రం):చేవెళ్ల ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా డయాలసిస్ వార్డులో జరిగిన సంఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా డయాలసిస్ వార్డును పరిశీలించారు. సమస్య పరిష్కారించి డయాలసిస్ వార్డులో వైద్యసేవలు కొనసాగుతున్నాయని వైద్యులు ఎమ్మెల్యే కు చెప్పారు. ఆసుపత్రిలోని ఇతర వార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల ఆసుపత్రి వంద పడకల కోసం 17 కోట్ల నిధులు మాజురయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. చేవెళ్లలోని అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానాని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Related posts